Kuppam: తప్పుడు FIR లతో అరెస్టులా?

కుప్పంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు కుప్పం మూడు రోజుల పర్యటనలో భాగంగా పోలీసులు పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు..

Update: 2023-01-09 09:51 GMT
  • కుప్పంలో టీడీపీ నేతల అరెస్టులను ఖండించిన చంద్రబాబు

దిశ, డైనమిక్ బ్యూరో: కుప్పంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు కుప్పం మూడు రోజుల పర్యటనలో భాగంగా పోలీసులు పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే ఆదివారం రాత్రి నలుగురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పైగా అరెస్ట్‌ను పోలీసులు చూపించకపోవడంతో నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుున్నారు. ఈ అరెస్ట్‌లపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో అక్రమ అరెస్ట్‌లను ట్విటర్ వేదికగా ఖండించారు. పోలీసులే తప్పుడు ఫిర్యాదులతో 4 తప్పుడు ఎఫ్ఐఆర్‌లు రాసి చేస్తున్న ఈ అరెస్టులు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. ఎఫ్ఐఆర్‌లో'ఇతరులు' అని పెట్టి వైసీపీ నేతల సూచనల ప్రకారం టీడీపీ  కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఫిర్యాదులు చేసిన ఎస్ఐలు, సీఐలు, వెనకుండి కథ నడిపిస్తున్న డీఎస్పీలు, ఎస్పీలు చేస్తున్న తప్పులకు తప్పక శిక్ష అనుభవిస్తారని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. 

ఇవి కూడా చదవండి : Letter To DGP: Nara Lokesh పాదయాత్రకు అనుమతివ్వండి

Tags:    

Similar News