జైలు నుంచి చంద్రబాబు విడుదల.. దేవాన్ష్‌ను ముద్దాడిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు ఉత్తర్వులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సిబ్బందికి ఆదేశాలు అందిన నేపథ్యంలో చంద్రబాబు విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ నారా లోకేశ్, నారా బ్రాహ్మణిలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ములాఖత్ అయ్యారు. అనంతరం చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు భార్య నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌లు చంద్రబాబు నాయుడుకు ఎదురెల్లి స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడుకు కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుతోపాటు మరికొంతమంది టీడీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, నేతలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రధాన గేటు వద్దకు తరలి రావడంతో అక్కడ సందడి నెలకొంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ప్రధాన గేటు వరకు కాలినడకన చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ఎన్‌ఎస్‌జీ వాహనం చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణ సైతం స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్‌ను ముద్దాడారు. ఆ తర్వాత భార్య, కోడలు, బావమరిది నందమూరి బాలకృష్ణలతో మాట్లాడారు. అనంతరం వారి భుజం తట్టారు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భుజం తట్టి కౌగిలించుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలకు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు హారతిలిచ్చారు. ఇదిలా ఉంటే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కనీసం చంద్రబాబు నాయుడు ఎన్ఎస్‌జీ వాహనం కూడా వెల్లలేనంతగా టీడీపీ శ్రేణులు మోహరించారు. జై బాబు జైజై బాబు నినాదాలతో రాజమహేంద్రవరం సెంట్రల్ ప్రాంగణం మార్మోగుతుంది.
Read More..