మంకీపాక్స్ టెస్ట్ కిట్ ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి మంకీపాక్స్.

Update: 2024-08-29 12:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి మంకీపాక్స్. అన్ని దేశాలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ వ్యాధికి ప్రత్యేక వైద్యం, మందులు అంటూ ఏదీ లేకపోయినా రాష్ట్రాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ నిర్ధారణకు ఏపీ మెడ్ టెక్ జోన్ అభివృద్ది చేసిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ కిట్ తయారు చేసిన కంపెనీని అభినందించిన సీఎం.. ఇది 'మేక్ ఇన్ ఏపీ' ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటుతుందన్నారు. 


Similar News