నీతి ఆయోగ్ సీఈవోతో చంద్రబాబు భేటీ
నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‍తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో : నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‍తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయన్ డాక్యుమెంట్ నోట్‌ను చంద్రబాబు సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌కు అందజేశారు. ఇకపోతే జీ-20 సమావేశానికి దేశం వేదిక కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ-20 సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేయనున్నారు. జీ-20 సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రధాని మోడీ సోమవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిజిటల్ నాలెడ్జ్ అంశంపై చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రబాబు సూచించిన అంశాన్ని తన ప్రసంగంలో మోడీ ప్రస్తావించారు. డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‍పై చర్చించాలని చంద్రబాబుకు మోడీ సూచించారు. అంతేకాదు నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు ప్రధాని మోడీ తెలిపారు. దీంతో చంద్రబాబు మంగళవారం నీతి ఆయోగ్ సీఈవోతో భేటీ అయ్యారు. విజన్ డాక్యుమెంట్ నోట్‍ను పరమేశ్వరన్‍కు చంద్రబాబు అందజేశారు. ఈ సందర్భంగా భారత్ భవిష్యత్ ప్రయాణంపై డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలన్నారు. రాబోయే 25 ఏళ్లలో భారత్ నంబర్ వన్ దేశంగా అవతరిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more:
ఆ తిట్లను మోడీ అంతా తేలిగ్గా మర్చిపోరు బాబు: MP విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్