BREAKING: పెన్షన్ దారులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. భారీగా ఆసరా పెన్షన్లు పెంపు

పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు.

Update: 2024-06-14 03:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు. ఈ మేరకు పెన్షన్లు పెంచుతూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్య్సకారులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి పెంఛన్లు పెరిగాయి. పెరిగిన పెన్షన్ల ప్రకారం.. వృద్ధులు, వితంతువులు, చేనేత, మత్స్యకారులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి రూ.10 వేలు, పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15 వేల పెన్షన్ ప్రభుత్వం అందించనుంది. పెన్షన్ల పెంపుతో పాటు ఈ స్కీమ్ పేరును కూడా తాజాగా ప్రభుత్వం మార్చింది. గత వైసీపీ ప్రభుత్వం వైఎస్సాఆర్ ఆసరా పెన్షన్ అని పేరు పెట్టగా.. చంద్రబాబు సర్కార్ ఆ పేరును తొలగించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా పేరును పునరుద్దరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.


Similar News