ఏఐజీ నుంచి చంద్రబాబు డిశ్చార్జ్
టీడీపీ అధినేత చంద్రబాబు ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్య కారణాల వల్ల గురువారం ఉదయం ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు చేరారు. వైద్యులు చంద్రబాబుకు చికిత్స అందించగా.. ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. దీంతో ఏఐజీ నుంచి నేరుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చంద్రబాబు బయల్దేరారు. చంద్రబాబు వెంట సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు.