చంద్రబాబూ!దమ్ముంటే చర్చకు రా: మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఛాలెంజ్

చంద్రబాబు నాయుడు కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చే ముఖ్యమంత్రి మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

Update: 2023-12-10 09:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : చంద్రబాబు నాయుడు కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చే ముఖ్యమంత్రి మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు నేడు రైతులను ఉద్దరించే నాయకుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమంపై చర్చించేందుకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. రైతుల సంక్షేమం కోసం టీడీపీ హయాంలో ఏం జరిగింది.. వైసీపీ పాలనలో ఏం జరిగింది అనేదానిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దమ్ముంటే చర్చకు రావాలన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడినవి అవాస్తవాలని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. మిచౌంగ్ తుఫాన్ పలు జిల్లాల్లో నష్టాన్ని కలిగించింది అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకొని తీర ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించిందని చెప్పుకొచ్చారు. అందువల్లే పెద్ద నష్టం తప్పిందని అన్నారు. అంతేకాకుండా ప్రజాజీవనానికి కూడా ఆటంకం లేకుండా చూశామన్నారు. విద్యుత్ కు సంబంధించి అపార నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని పిలిపించి పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా స్వయంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారని చెప్పుకొచ్చారు. తుఫాన్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారని మంత్రి కాకాణి గోవర్థణ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఆదుకోకుండా విమర్శలా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు.టీడీపీ నాయకులు ఇళ్లలోంచి బయటకు రాలేదని చెప్పుకొచ్చారు. కేవలం మీడియా సమావేశాలకి పరిమితమయ్యారన్నారు. ఇందులో కూడా బెదిరింపులు.. బ్లాక్ మెయిల్ చేశారన్నారు. చంద్రబాబు హయాంలో రైతును పట్టించుకోలేదు. రైతులను మోసం చేయడం ..వ్యవసాయం దండగ.. ఉచిత విద్యుత్ ..కష్టం అంటూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారని గుర్తు చేశారు.ఇప్పుడు నష్టపరిహారంపై తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ అధికంగా నష్ట పరిహారాన్ని చెల్లిస్తున్నారు. చంద్రబాబు కు పచ్చ మీడియా డైరెక్షన్ ఇస్తోంది అని ఆరోపించారు. వాళ్ళు చెప్పినట్టు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్ ఫుట్ సబ్సిడీని కూడా చంద్రబాబు దారి మళ్ళించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పంట నష్టాలకు సంబంధించి రైతులకు బీమా చెల్లిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

బంగాళాదుంపల వ్యాఖ్యలపై కౌంటర్

బంగాళదుంపలను ఈ ప్రాంతంలో ఏమని అంటారని మాత్రమే జగన్ అడిగారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇచ్చే ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు. ప్రజలతో మమేకమయ్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. రైతు రథం.. నీరు చెట్టు కింద నిధులను టీడీపీ నేతలు దుర్వినియోగం చేశారు అని చెప్పుకొచ్చారు. పంట నష్టాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి వివరాలను రైతు భరోసా కేంద్రంలో ప్రదర్శిస్తున్నామని..ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పుకొచ్చారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వం మీద బురద చల్లాలని తపనతోనే చంద్రబాబు ..లోకేశ్‌లు విమర్శలు చేస్తున్నారన్నారు. లోకేశ్‌కు కందిపప్పు పెసరపప్పుకు తేడా తెలియదు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News