Prakasham Barriage:ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం..కీలక విషయాలు వెల్లడి

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా పలు ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది.

Update: 2024-09-12 08:04 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా పలు ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది. గత వారం రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా వర్షాలు(Rains) దంచికొట్టాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు(Floods) ముంచెత్తాయి. ఈ క్రమంలో విజయవాడలో (Vijayawada) వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అయితే ఈ వరదలతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశం బ్యారేజీని(Prakasham Barriage) కేంద్ర బృందం సందర్శించింది. ఇటీవల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే.

నేడు(గురువారం) కేంద్ర బృందం బ్యారేజీని పరిశీలించింది. బ్యారేజ్ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వెల్లడించారు. ఈ క్రమంలో ESC వెంకటేశ్వర్లు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన రికార్డ్ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. అంతేకాదు పరుగులు పెడుతున్న కృష్ణా నది(Krishna River) పరీవాహక ప్రాంతంలో పరిస్థితుల గురించి, ముంపునకు సంబంధించిన వివరాలను తెలిపారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని(Prakasham Barriage) అధికారులు పేర్కొన్నారు. దీంతో సముద్రంలోకి 15.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కోనసీమలో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయని సమాచారం.


Similar News