పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌పై సీఈసీ స్పష్టత

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టత ఇచ్చింది. డిక్లరేషన్ సీల్ లేకపోయినా ఓటు చెల్లుతుందని పేర్కొంది.

Update: 2024-05-30 08:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టత ఇచ్చింది. డిక్లరేషన్ సీల్ లేకపోయినా ఓటు చెల్లుతుందని పేర్కొంది. కానీ, ఆ డిక్లరేషన్‌పై గెజిటెడ్ సంతకం మాత్రం కచ్చితంగా ఉండాలని, సీల్, హోదా ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. వైసీపీ అభ్యంతరాలపై సీఈఓకు సీఈసీ గురువారం లేఖ ద్వారా తెలియజేసింది. కాగా, ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. అదే సమయంలో గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా పోలయ్యాయి. దీంతో అందరి దృష్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే పడింది. సహజంగా ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రతిబింబంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను భావిస్తారు. మరి ఈసారి పోస్టల్ బ్యాలెట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Tags:    

Similar News