వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు

దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ ఇప్పటికే పలువురును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే

Update: 2023-03-01 08:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ ఇప్పటికే పలువురును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని రెండుసార్లు సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారించింది.

గత నెల 23న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 12న విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. ఇందులో భాగంగా వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చింది. కడప జిల్లా కేంద్రకారాగారంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపనలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News