బ్రేకింగ్: వేగం పెంచిన CBI.. వివేకా హత్య కేసులో MP అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది.
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, కడప ఎంపీ వైఎష్ అవినాష్ రెడ్డిని ఇప్పటికే విచారించిన సీబీఐ.. మరోసారి దర్యాప్తుకు హాజరు కావాలని తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు.
అయితే, సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి ఇవాళ హాజరు కావాల్సి ఉండగా.. వ్యక్తిగత పనుల వల్ల రాలేనని చెప్పడంతో సీబీఐ మరో రోజు విచారణకు పిలిచింది. అంతేకాకుండా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12వ తేదీన కడపలో సీబీఐ ముందు విచారణకు హాజరవ్వాలని అధికారులు నోటీసుల్లో ఆదేశించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే అధికారులు భాస్కర్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :