CBI: భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డికి ముగిసిన విచారణ... అవినాశ్‌రెడ్డికి కంటిన్యూ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణ కొనసాగుతుంది..

Update: 2023-04-19 10:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. ఉదయం నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డికి విచారణ కొనసాగుతోంది. మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ ముగిసింది. దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాశ్ రెడ్డిని దాదాపు 6 గంటలకు పైగా లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు.  సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్ ఆధ్వర్యంలో ముగ్గురినీ విచారించారు. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది.  దీంతో లిఖితపూర్వకంగా ప్రశ్నలు ఇచ్చి విచారించారు. కాగా ఇప్పటివరకు నాలుగు సార్లు విచారణ జరిగినప్పటికీ ఎంపీ అవినాశ్ రెడ్డి సహకరించడం లేదని సీబీఐ ఆరోపించింది. దీంతో ఈనెల 25 వరకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. 

కాగా కస్టడీకి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి

అయితే వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులుగా రిమాండ్‌లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టు వీరిని కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలతో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. చంచల్ గూడ జైలు నుంచి నేరుగా సీబీఐ కార్యాలయానికి తరలించి విచారించారు.

ఇవి కూడా చదవండి: CBI: ఇవాళ్టికి ముగిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ

Tags:    

Similar News