Ys Viveka Murder Case: ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రశ్నిస్తున్న సీబీఐ.. సర్వత్రా ఉత్కంఠ

దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది...

Update: 2023-02-24 10:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు విచారణను తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేయడంతో అధికారులు విచారణలో స్పీడు పెంచారు. ఇందులో భాగంగా పలువురుని సీబీఐ అధికారులు విచారించారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని సైతం ఇటీవలే విచారించారు. మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో న్యాయవాదులతో కలిసి ఎంపీ అవినాశ్ రెడ్డి శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.


కాగా గత నెల 28న తొలిసారి ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. అప్పుడు సుమారు నాలుగు గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు.  వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి ఫోన్ కాల్స్‌పై ఆరా తీశారు. సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, సీఎం సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌కు పదే పదే ఫోన్లు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో తాజాగా వైఎస్ అవినాశ్ రెడ్డిని మరోసారి విచారణకు పిలవడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News