కుల గణనకు చట్టబద్ధత కల్పించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు

కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు స్వాగతించారు.

Update: 2023-11-05 08:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే కేబినెట్ నిర్ణయానికి చట్టబద్ధత కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు డిమాడ్‌ చేశారు. ఆర్థిక సామాజిక సర్వే తరహాలో వలంటీర్ల చేత కుల గణన చేస్తామని ప్రభుత్వం చెప్తోందని మండిపడ్డారు. ఈ చర్యలు పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి చర్యలు కుల అసమానతలను తగ్గించడానికి చేస్తున్నట్లు లేదని విమర్శించారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం, బీసీలను మభ్యపెట్టడానికి చేస్తున్నట్లుగానే కనిపిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో జన గణనతోపాటు రాష్ట్రంలో కులగణన చేస్తే అది సమగ్రంగా,వివాదాలకు అతీతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు కోరారు.

Tags:    

Similar News