ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే...!

ఓటుకు నోటు కేసు వాయిదా పడింది.....

Update: 2024-04-18 15:41 GMT

దిశ, వెబ్ డెస్క్: ఓటుకు నోటు కేసు వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.


ఓటుకు రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా బుక్కయ్యారని, ఆ ఆడియోలు, వీడియోలను ప్రపంచం మొత్తం చూసిందని ఆళ్ల గుర్తు చేశారు. సాక్షాధారాలు పక్కాగా ఉన్నా కేసు ముందుకు కదలకపోవడానికి చంద్రబాబే కారణమని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఏడేళ్లుగా కేసును ముందుకు సాగనివ్వడంలేదని మండిపడ్డారు. జులై 24 వరకు ఆఖరి అవకాశమని, ఆ తర్వాత వాయిదాలు ఉండవని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తెలిపిందని తెలిపారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని..శిక్ష పడక తప్పదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News