Good News: త్వరలో అందుబాటులోకి కేన్సర్ చికిత్సా కేంద్రం

త్వరలో కర్నూలులో కేన్సర్ చికిత్స కేంద్రం అందుబాటులోకి రానుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు...

Update: 2025-03-23 13:47 GMT
Good News: త్వరలో అందుబాటులోకి కేన్సర్ చికిత్సా కేంద్రం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: త్వరలో కర్నూలు(Kuranool District)లో కేన్సర్ చికిత్స కేంద్రాన్ని(Cancer Treatment Center) అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్(Health Minister Satyakumar Yadav) తెలిపారు. విజయవాడ(Vijayawada), గుంటూరు(Guntur)లో పర్యటించిన ఆయన బలభద్రపురం కేన్సర్ కేసులపై స్పందించారు. బలభద్రపురంలో ప్రతి ఇంటికి వైద్యుల బృందం వెళ్లి ప్రజలకు కేన్సర్ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. అలాగే బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ ప్రశాంత్ హాస్పిటల్‌లో ప్రోస్టేట్ సమస్యలకు చికిత్సలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేన్సర్ నిర్ధారణ టెస్టులు ఫ్రీగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని మరో సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.


అటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపైనా ఆయన స్పందించారు. తమ ప్రభుత్వంపై గత సర్కార్ అప్పుల భారం మోపిందని,  ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదన్నారు. ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్‌మెంట్లు అప్పుల్లో కూరుకుపోయాయని చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానితో చెలగాటమాడిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో సిబ్బంది కొరతను త్వరలో అధిగమిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 

Tags:    

Similar News