Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. రూ.3.20 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం

2025-26 వార్షిక బడ్జెట్‌(Annual budget)కు సంబంధించి సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది.

Update: 2025-02-28 04:19 GMT
Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. రూ.3.20 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: 2025-26 వార్షిక బడ్జెట్‌(Annual budget)కు సంబంధించి సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు మొత్తం రూ.3.20 లక్షల కోట్లతో వార్షి బడ్జెట్‌‌ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ మేరకు మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు అసెంబ్లీ(Assembly)లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav), శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టబోతుండటం విశేషం. అయితే, ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ అటు రాజకీయ వర్గాల్లోనూ.. ఇటు సాధారణ ప్రజల్లోనూ ఓ రకమైన ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్‌‌లో సూపర్ సిక్స్ పథకాల (Super Six Schemes)తో పాటు రాష్ట్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజన్-2047 లక్ష్యంగా ఆర్థిక శాఖ వార్షిక బడ్జెట్‌ను రూపొందించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Tags:    

Similar News