Crime News : వివస్త్రను చేసి, జుట్టు కత్తిరించి.. మహిళపై దారుణ అమానుషం
మహిళ అని కూడా చూడకుండా వివస్త్రను చేసి, జుట్టు కత్తిరించి దారుణంగా అవమానానికి గురి చేసిన ఘటన ఏపీ(AP)లోని శ్రీసత్యసాయి అనంతపురం(SriSatyasai Anantapuram) జిల్లాలో చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : మహిళ అని కూడా చూడకుండా వివస్త్రను చేసి, జుట్టు కత్తిరించి దారుణంగా అవమానానికి గురి చేసిన ఘటన ఏపీ(AP)లోని శ్రీసత్యసాయి అనంతపురం(SriSatyasai Anantapuram) జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమజంటకు సహకరించిందన్న అనుమానంతో పలువురుఓ మహిళను బట్టలు ఊడదీసి, గుండు గీయించి, చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, పలువురిని అరెస్ట్ చేశారు.