BREAKING: కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. అధికారుల కీలక ప్రకటన

కర్ణాటక, ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షాలతో హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ నిండు కుండలా మారింది.

Update: 2024-08-11 04:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక, ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షాలతో హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ నిండు కుండలా మారింది. ఈ క్రమంలోనే అధికారులు దిగువకు నీటిని విడుదల చేసేందుకు గేట్లును ఎత్తగా.. డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్యామ్ భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా కౌతాలం. కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలకు ప్రతి క్షణం అలర్ట్‌గా ఉండాలని సూచించారు. 

Tags:    

Similar News