BREAKING: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిదే అధికారం.. రాసిపెట్టుకోండి : వైసీపీకి పవన్ కల్యాణ్ సవాల్

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిదే అధికారం.. రాసి పెట్టుకోండని వైసీసీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు.

Update: 2024-05-13 15:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిదే అధికారం.. రాసి పెట్టుకోండని వైసీసీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. రాష్ట్ర వాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినందున మంగళగిరిలో ఓటేసిన ఆయన హుటాహుటిన వారణాసి బయలుదేరారు. ఈ మేరకు ఆయన రేపు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఆహ్వానం అందడంతో పవన్, తన భార్య అన్నా లెజినోవాతో కలిసి వారణాసికి వెళ్లారు.ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధింస్తుందని తెలిపారు. ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం రాసి పెట్టుకోండంటూ వైసీపీ నేతలకు ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. మూడో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు.   

Tags:    

Similar News