BREAKING: కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్ వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్ వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు 2,146 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఇవాళ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణాబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే 2014 ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారో వారంతా ఇక మీదట పర్మనెంట్ ఉద్యోగుల విభాగం కిందకు రానున్నారు. ఇక విభాగాల వారీ వస్తే.. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2,025 మంది, డీఎంఈ పరిధిలో 62 మంది, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాల్లో నలుగురిని రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Read More..
AP Political News: రానున్న ఏపీ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఇదేనా..?