BREAKING: ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తా
ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈసీ ఆయనపై బదిలీ వేటు వేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈసీ ఆయనపై బదిలీ వేటు వేసింది. అదేవిధంగా రాజేంద్రనాథ్ రెడ్డి పదవి నుంచి వెంటనే రిలీవ్ కావాలని, ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఏపీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈసీ ఆదేశాల మేరకు హరీశ్ కుమార్ గుప్తా ఇవాళ రాత్రిగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ ఆకస్మికంగా బదిలీ బదిలీ చేయడంతో నిన్న తాత్కాలిక డీజీపీగా శంఖబ్రత బాగ్చి బాధ్యతలు స్వీకరించారు. కాసేపటి క్రితం ఆయన నుంచి పూర్తిస్థాయి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు.