BREAKING: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 40 అంశాలు ఎజెండాగా మీటింగ్ కొనసాగుతోంది.
దిశ, వెబ్డెస్క్ : ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 40 అంశాలు ఎజెండాగా మీటింగ్ కొనసాగనుంది. ఈ మేరకు 6,100 పోస్టులకు గాను మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు కూడా ఆమోదం తెలిపారు. ఫిబ్రవరిలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కేబినెట్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదేవిధంగా వర్సిటీలు, విద్యా సంస్థలలో టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసును 62 కు పెంచాలని తీసుకున్నారు.