BREAKING: ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలపై వచ్చిన క్లారిటీ.. ఆ రోజే ఫలితాల విడుదల

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.

Update: 2024-04-10 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మిడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు 12న ఫలితాను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. జవాబు పత్రాల మూల్యాంకనం, పేపర్ల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. అయితే, పేపర్ రీ వ్యాల్యుయేషన్ మరో చేస్తున్నారు. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తికావొచ్చిందని తెలుస్తోంది. కాగా, ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 20 వరకు కొనసాగాయి. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.

Tags:    

Similar News