BREAKING: పవన్ కల్యాణ్ కంటే చిరంజీవి ఆ విషయంలో చాలా బెటర్: కాపు నేత ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల సమరానికి అన్ని పార్టీల నేతలు సై అంటున్నారు.

Update: 2024-03-29 07:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల సమరానికి అన్ని పార్టీల నేతలు సై అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు పరస్పర ఆరోపణలతో మీడియా ముందుకొస్తున్నారు. అయితే, ఇటీవలే అధికార వైసీపీలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి జనసేన అధినేతపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన కర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్ విషయాలపై హామీ ఇస్తే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ ఆ పార్టీ అధిష్టానం ముందు పెట్టానని, వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతోనే వైసీపీలో చేరానని ముద్రగడ స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని జగన్ రామరాజ్యం చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై కూడా సీఎం జగన్ దృష్టి పెడతారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. మరో 30 ఏళ్ల పాటు రాష్ట్రంలో జగనే అధికారంలో ఉంటారని ముద్రగడ అన్నారు. సీఎం ఆదేశాలతో ఇకపై తన నుంచి ఎలాంటి ఉద్యామాలు ఉండవని స్పష్టం చేశారు. అదేవిధంగా టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పిఠాపురంలో పవన్ ఓటమి అప్పుడే ఖరారైందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రజలు ప్యాక్ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు అనేవి సినిమాలా కాదని.. ఆవేశంతో మాట్లాడితే జనం ఓట్లు వేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. డబ్బు ఉన్న వాళ్లకు జనసేనలో వంద శాతం దక్కిందంటూ ఆరోపణలు చేశారు. రాజకీయాలకు సంబంధించి పవన్ కల్యాణ్ కంటే చిరంజీవే చాలా బెటరని అన్నారు. చంద్రబాబు చెప్పిన మాయమాటలు విని పవన్ తన ఇంటికి రాలేదని తెలిపారు. చంద్రబాబును పవన్ జైలులో కలిశాక తన గ్రాఫ్ పెరిగిందని చెప్పినందుకే బాబుకు తనపై కోపం వచ్చిందంటూ ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు.

Tags:    

Similar News