BREAKING: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్.. ఎన్డీఏ అభ్యర్థిని దూషించాడని కేసు నమోదు
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టారు.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టారు. ప్రచారం ముగిసినప్పటికీ ఆయా పార్టీ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్పై కేతిరెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. అయితే, మునిసిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై సెక్షన్ 153 ,188 కింద కేసు నమోదు చేశారు.