BREAKING: నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు షురూ.. అందరి కళ్లు ఆ ఇద్దరి మీదే!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అప్రతిహత విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది.

Update: 2024-06-21 03:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అప్రతిహత విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే కేబినెట్ కొలువుదీరడంతో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు రోజుల పాట సభ కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రొటెం స్వీకర్‌గా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొత్తం సభలోని 174 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, 23 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు.

అనంతరం మహిళా ఎమ్మెల్యే, మిగిలిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు కలిగిన వైసీపీ ఈ సారి ప్రతిపక్ష హోదాను కోల్పోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, అసెంబ్లీలో ఆయనకు ఎక్కడ సీటు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. అదేవిధంగా తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న పవన్‌ కల్యాణ్ అందరి కళ్లు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఆ దృశ్యం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం రేపు స్పీకర్‌ను ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది.

Tags:    

Similar News