BREAKING: ప్రభుత్వ పథకాలకు బ్రేక్.. సర్కార్ రిక్వెస్ట్‌కు ఈసీ రెడ్ సిగ్నల్

ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి ఈసీ

Update: 2024-05-06 12:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి ఈసీ అనుమతి నిరాకరించింది. స్కీమ్స్‌కు ఫండ్స్ రిలీజ్ చేసేందుకు ఈసీ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇన్ ఫుట్ సబ్సిడీ పంపిణీకి ఈసీ నో చెప్పింది. పంట నష్ట పరిహారం చెల్లించేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈసీ అనుమతి నిరాకరించడంతో ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్ పడింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత యధావిధిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కంటిన్యూ కానున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. 


Similar News