Braking News: వైసీపీకి గుడ్ బై చెప్పనున్న బొప్పన..

వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

Update: 2024-01-13 10:07 GMT

దిశ వెబ్ డెస్క్: వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. జగన్ అధికార ధోరణితో అసహనం చెందిన మరికొంతమంది నేతలు పార్టీ నుండి బయటకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న వార్తలకు జీవం పోస్తూ వైసీపీ నేత విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ ఆ పార్టీ నుండి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో బొప్పన భవకుమార్ తో దేవినేని అవినాష్ అలానే ఇతర నేతలు భేటీ అయ్యారు. భవకుమార్ ను పార్టీ వీడవద్దని బుజ్జగించారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన బొప్పన భవకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడొద్దంటూ తనపై వైసీపీ అధిష్టానం నుండి తీవ్ర ఒత్తిడి తెస్తుందని.. తనకు మాత్రం వైసీపీలో ఉండాలనే ఆసక్తి లేదని.. ఈ నేపథ్యంలో తాను తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు.

ఇక కార్యకర్తలను, శ్రేయోభిలాషులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని తెలిపిన ఆయన త్వరలోనే ఏ విషయం తెలియ చేస్తామని పేర్కొన్నారు. అలానే వైసిపి ప్రభుత్వ అధికార ధోరణితో చాలామంది నేతలు విసిగిపోయారని.. ఈ నేపథ్యంలో వారంతా వైసిపిని వీడేందుకు సిద్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు అభ్యర్థిగా బొప్పన భవకుమార్ పోటీ చేశారు. అయితే అనుకోని రీతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఆయన 2019 నుంచి నగర అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 

Tags:    

Similar News