మార్చుకోవాల్సింది పేరు కాదు, బుద్ధి.. ముద్రగడకు బొలిశెట్టి కీలక సూచన

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్ని్కల సమయంలో కాపు నేత ముద్రగడ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

Update: 2024-06-21 16:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్ని్కల సమయంలో కాపు నేత ముద్రగడ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. తాజాగా, ఈ ఘటనపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా ముద్రగడకు కీలక సూచన చేశారు. పద్మనాభరెడ్డి గారు, పెద్దరికం నిలబెట్టుకోవాలంటే మార్చుకోవాల్సింది పేరు కాదు, బుద్ధి అని చురకలు అంటించారు. ఇకపై కుల రాజకీయం, పవన్ కల్యాణ్ గారికి సలహాలు ఇవ్వడం మానేసి మీరు అభిమానించే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి గారికి లేదా మీకు వైసీపీ కండువా కప్పిన వైఎస్ జగన్‌కు సలహాలు ఇవ్వండి అని సూచించారు.  


Similar News