Ap News: ఏపీ అప్పులపై పురంధేశ్వరి ఆందోళన.. కీలక వ్యాఖ్యలు

ఏపీ అప్పులపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి విమర్శలు చేశారు..

Update: 2023-07-27 14:07 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అప్పులపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి ఆందోళన చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా అసెట్ క్రియేట్ చేయలేదని వ్యాఖ్యానించారు. దీనిపై చర్చించేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బీఎమ్ పరిమితిని దాటిపోయాయని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఉద్యోగులకు సైతం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు.

ఇక రాష్ట్రంలో బీజేపీ పరిస్థితులు, పొత్తులపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్థాగత అంశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, బీజేపీ సీనియర్ నేత సంతోష్‌తో చర్చించనట్లు ఆమె తెలిపారు. పొత్తులపై ఇప్పుడే నిర్ణయం ఉండదని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు పొత్తులపై ప్రకటన చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందే పొత్తులపై నిర్ణయం తీసుకుంటారని, అది కూడా అధిష్టానం మాత్రమే వెల్లడిస్తుందని పురంధేశ్వరి పేర్కొన్నారు. 


Similar News