‘అసలు వైసీపీలో ఏమాత్రం రాజకీయ పార్టీ లక్షణాలు లేవు’

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan)పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు.

Update: 2024-09-04 13:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan)పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదలను జగన్ రాజకీయం చేయాలని కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరదలపై ప్రధాని నరేంద్ర మోడీ రోజూ ఆరా తీస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు కేంద్రం, బీజేపీ(BJP) అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అసలు ఏమాత్రం వైసీపీ(YCP)లో రాజకీయ పార్టీ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు.

గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. గుండమానేరు కాలువను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలోనే భారీగా చెరువులు, కుంటలు, కాలువలు కబ్జాకు గురయ్యారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడించినందుకు ప్రజలపై వైసీపీ కక్ష గట్టిందని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు ఏపీలో కూడా ఉండటం లేదని.. ఇతర రాష్ట్రాల్లో ఉండి.. ఎన్డీఏ(NDA) ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వరదల గురించిన సమాచారం తెలియగానే.. 12 వేల మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక చెరువుల కబ్జాల వలనే ఈ విపత్తులకు కారణమని.. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.


Similar News