ఇంకా బుద్ధి రాలేదు.. రోజాపై బీజేపీ నేత భానుప్రకాశ్ ఫైర్
బీజేపీ చీఫ్ పురంధేశ్వరీపై రోజా చేసిన వ్యాఖ్యలను భానుప్రకాశ్ రెడ్డి ఖండించారు..
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ (Tirumala Laddu)లో జంతువుల అవశేషాలు కలిశాయని ఎన్డీడీబీ రిపోర్టులో నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Former Chairman YV Subbareddy), మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి(Former MP Subrahmanya Swamy) పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తిరుమల లడ్డూను రాజకీయం చేయొద్దంటూ సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయింది. దీంతో కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu)కు వచ్చిన సమాచారం మేరకే ఆయన మాట్లాడారని, లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి (BJP state president Purandheswari) వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మాజీ మంత్రి రోజా (Former minister Roja) తప్పుబట్టారు. బావ కళ్లలో ఆనందం కాదని, భక్తుల్లో చూడాలని కౌంటర్ ఇచ్చారు.
అయితే పురంధేశ్వరిపై రోజా చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి(BJP leader Bhanu Prakash Reddy) ఖండించారు. కోర్టు ప్రోసిడింగ్స్ ఏ విధంగా ఉంటాయో వైఎస్ జగన్ (Ys Jagan), ఎంపీ విజయసాయిరెడ్డి (Mp VijayasaiReddy)ని రోజా అడిగి తెలుసుకోవాలని సూచించారు. గత ఐదేళ్లు జగన్ కళ్లలో ఆనందం చూసేందుకు డ్యాన్స్‌లు, డ్రామాలు చేసింది సరిపోదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని సెటైర్లు వేశారు. పురంధేశ్వరీపై రోజా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.