ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక బిగ్ షాట్స్: డిప్యూటీ CM పవన్ కీలక వ్యాఖ్యలు

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం అటవీ శాఖ అధికారులతో ఆయన

Update: 2024-07-05 12:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న ఎర్ర చందనం అక్రమ రవాణా వెనక పెద్ద తలకాయలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్మగ్లరతో పాటు వాళ్లను వెనకుండి నడిపిస్తున్న వారిని కూడా పట్టుకోవాలని అధికారులకు సూచించారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం దుంగలను స్లగ్మర్లు ఎక్కడ దాచి పెడుతున్నారో తక్షణమే గుర్తించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

ఇకపై రెడ్ శాండిల్‌వుడ్ స్మగ్లింగ్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక ఎంత పెద్ద వారు ఉన్న వదలిపెట్టొద్దని ఆదేశించారు. అడవుల్లోని సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. కాగా, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు.. అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీ రాజ్ శాఖలను సైతం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటవీ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ అధికారులతో ఇవాళ రివ్యూ నిర్వహించారు.


Similar News