BJP MP సుజనా చౌదరికి బిగ్ షాక్.. మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) షాకిచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) షాకిచ్చింది. సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాజేజీ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ఎన్ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే మెడిసిటీ మెడికల్ కాలేజీలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీకి గుర్తింపు రద్దు చేసిన నేషనల్ మెడికల్ కౌన్సిల్.
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2023
2023 - 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేత pic.twitter.com/FJLz2q5EvQ