BIG News: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజు నుంచే!

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 సీట్లలో విజయం సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసింది.

Update: 2024-06-11 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 సీట్లలో విజయం సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే బుధవారం గన్నవరం వేదికగా చంద్రబాబు సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం చేసే పథకానికి అమలు చేసేందుకు శ్రీకారం చుడుతోంది. సీఎం బాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం ఫైల్‌పై పెట్టుబోతున్నట్లుగా తెలుస్తోంది. లేదా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఆ రెండింటిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడ లేదు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు కోసం విధివిధానాలను రుపొంచించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు అనుభవం కలిగిన ఐదుగురు ప్రత్యేక అధికారులతో ఓ కమిటీని వేసినట్లుగా సమాచారం. అన్ని సక్రమంగా జరిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జులై 1 నుంచి అమలు చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 


Similar News