BIG BREAKING: ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

ఏపీలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టింది.

Update: 2024-06-19 19:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన సర్కార్ గంటల వ్యవధిలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రానికి నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం అర్ధరాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ద్వారకా తిరుమలరావు నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు.


Similar News