BIG BREAKING: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక అప్‌‌డేట్

ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీయట్ బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చేసింది.

Update: 2024-04-11 08:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీయట్ బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు ఈ నెల12న అంటే శుక్రవారం (రేపు) ఇంటర్మీడియట్ ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. తెలిపింది. దీంతో రాబోయే ఫలితాలు ఎలా ఉంటయోనని విద్యార్థుల్లో కలవరం మొదలైంది. కాగా, ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.

Tags:    

Similar News