పాలిసెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్..రేపటి నుంచి తుది విడత కౌన్సిలింగ్

ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు బిగ్ అప్డేట్. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సిలింగ్ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు బి.నవ్య తెలిపారు.

Update: 2024-07-10 14:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు బిగ్ అప్డేట్. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సిలింగ్ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు బి.నవ్య తెలిపారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశాల కోసం వెబ్ ఆధారిత కౌన్సిలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువ పత్రాల పరిశీలన ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 16వ తేదీన సీట్లు కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 18 నుంచి 20వ తేదీలోగా సంబంధిత కళాశాలలో రిపోర్ట్‌ చేయాలి. తుది దశ కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://appolycet.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. తొలి విడత కౌన్సెలింగ్‌కు హాజరై సీటు పొందిన విద్యార్థులు బ్రాంచ్‌, కళాశాల మార్పు కోరుకుంటే అప్పటి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా హెల్పింగ్‌ కేంద్రాన్ని సందర్శించాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ఏపీ పాలిసెట్ తరగతులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.


Similar News