Tirumala News:భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ సంచలన నిర్ణయం!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

Update: 2024-09-19 09:53 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో భక్తులకు(devotees) ఎటువంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. అయితే స్వామి వారి దర్శన వేళలు, ఇతర సేవలకు గదులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

ఈ క్రమంలోనే తిరుమల(Tirumala) భక్తులకు టీటీడీ(TTD) కీలక ప్రకటన జారీ చేసింది. అది ఏంటంటే.. తిరుమల శ్రీవారికి సంబంధించిన కొన్ని దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల 8వ తేదీన జరగనున్న గరుడ సేవ కోసం అన్ని విభాగాల ఏర్పాటు పై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య అధికారులతో సమీక్షా సమావేశం(Review meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై అదనపు ఈవో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

భక్తుల సౌకర్యార్థం వయోవృద్ధులు(elderly) దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు(Cancel visions) చేశారు. వీటితో పాటు, అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో వచ్చే నెల 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో బైక్‌‌ల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు. మొత్తంగా తిరుమల భక్తులు(devotees) ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని టీటీడీ అధికారులు సూచించారు.

Read More..

AP News:తిరుమల లడ్డూ ప్రసాదం పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు  


Similar News