ఓ వైపు కృష్ణ.. మరోవైపు బుడమేరు.. డేంజర్ జోన్‌లో బెజవాడ

ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు బెజవాడలో కురిసిన కుంభ వృష్టి వర్షం కారణంగా వరదలు పోటెత్తాయి.

Update: 2024-09-02 04:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు బెజవాడలో కురిసిన కుంభ వృష్టి వర్షం కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో ప్రస్తుతం విజయవాడలోని అనేక కాలనీలు వరదల్లోనే చిక్కుకొని ఉండగా.. సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఇదిలా ఉంటే ఓ వైపు కృష్ణ.. మరోవైపు బుడమేరుకు వస్తున్న భారీ వరద కారణంగా బెజవాడ డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత 11 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుంది. ఈ వరద మరికొన్ని గంటలకు 12 లక్షల క్యూసెక్కుల దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం కాగా 24 కాలనీలు, పలు గ్రామాలను వరదలు ముంచెత్తాయి దీంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా ఈ రోజు ఉదయం ప్రకాశం బ్యారేజ్ లో ఉన్న మూడు బోట్లు లింక్ తెగిపోయి.. 40 కిలోమీటర్ల వేగంతో వచ్చి బ్యారేజీలోని 3,4 గేట్లను ఢీ కొట్టాయి. దీంతో డ్యామ్ గేట్లకు పగుళ్లు వచ్చాయి. ప్రస్తుతం వరద ప్రవాహం అధికంగా ఉండటంతో మూడు బోట్లు గేట్లకు అడ్డం పడ్డాయి. దీంతో అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.


Similar News