Breaking: శివరాంపురం వాసులను ముప్పు తిప్పలు పెడుతున్న ఎలుగుబంట్లు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి వాసులకు ఎలుగుబంట్లు నిద్రపట్టనివ్వడంలేదు.
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి నియోజకవర్గం వాసులకు ఎలుగుబంట్లు నిద్రపట్టనివ్వడంలేదు. తరచూ గ్రామంలో సంచరిస్తున్నాయి. స్థానికంగా కొండలపై నుంచి జనావాసుల్లోకి వస్తున్నాయి. రాత్రి సమయంలో ఊరి మధ్యలో ఎలుగు బంట్లు పరుగులు తీస్తున్నాయి. దీంతో కుక్కుల అరస్తూ వెంబడిస్తున్నాయి. అంతేకాదు పశువులపై దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే వాళ్లు పట్టించుకోలేదని అంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా సంతబొమ్మాళి మండలం శివరాంపురం గ్రామానికి సమీపంలోని పాడుబడిన బావిలో ఎలుగుబంటి పిల్ల పడింది. స్థానికులు గమనించి బయటకు తీశారు. తరచూ గ్రామంలో ఎలుగుబంట్లు వస్తున్నాయని.. ఇప్పటికే ఓ ఎలుగు బంటిని గ్రామం నుంచి తరిమేశామని తెలిపారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు అంటున్నారు. తమ గ్రామంలో సంచరిస్తున్న ఎలుగు బంట్లతో పాటు వాటి పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.