Bears : శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు హల్చల్

: శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఎలుగుబంట్లు(Bears)హల్చల్ చేశాయి. జిల్లాలోని మందస మండలం సువర్ణపురం గ్రామం శివాలయంలో ఒకేసారి మూడు ఎలుగుబంట్లు ప్రవేశించాయి.

Update: 2024-11-15 04:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఎలుగుబంట్లు(Bears)హల్చల్ చేశాయి. జిల్లాలోని మందస మండలం సువర్ణపురం గ్రామం శివాలయంలో ఒకేసారి మూడు ఎలుగుబంట్లు ప్రవేశించాయి. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో శివాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా నంది విగ్రహం వద్ద ఎలుగుబంట్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిన చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. వాటిని ఆలయం నుంచి ఆటవీ ప్రాంతంలోకి తరిమించాలంటూ భక్తులు, గ్రామస్తులు అటవీశాఖ అధికారులను కోరారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో ఎలుగుబంట్లు తరుచు ప్రజలను కలవర పెడుతున్నాయి.

గతంలో జీడి, కొబ్బరి తోటల్లో తిష్ట వేస్తూ వ్యవసాయ పనుల కోసం తోటలోకి వెళ్లే రైతులు, రైతు కూలీలపై దాడులు చేసే ఎలుగుబంట్లు ఇటీవల కాలంలో తరచూ గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి‌. మందస మండలం మల్లెనవారి పేట గ్రామంలోనూ ఇటీవల మూడు ఎలుగుబంట్లు చొరబడి హల్ చల్ చేసాయి. గ్రామ వీధుల్లో రాత్రంతా యదేచ్చగా సంచరిస్తూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి. మళ్లీ ఇప్పుడు సువర్ణపురంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి.

Tags:    

Similar News