బెయిలా? జైలా?: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై మరికాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2023-11-09 05:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై మరికాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ కేసును జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదిల బెంచ్ విచారిస్తోంది. అయితే ఈ కేసుపై గురువారం కోర్టు నెంబర్ 6లో 11 వ నెంబర్‌గా చంద్రబాబు కేసు లిస్ట్‌లో చేర్చారు. దీంతో మరికాసేపట్లో ఈ కేసుపై విచారణ ప్రారంభం కానుంది. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధానంగా 17-ఏ వర్తింపుపై వాదనలు జరిగాయి. ఈ తీర్పుపై వాదనలు ముగిసినట్లు ఇప్పటికే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. శుక్రవారం ఈ కేసుకు సంబంధించి తీర్పు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. 17 ఏపై కేసులో తీర్పు పెండింగ్ నేపథ్యంలో పైబర్ నెట్ కేసును గతంలో ఈనెల 9కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే 17-ఏ కేసులో ఇప్పటి వరకు తీర్పును వెల్లడించలేదు. అంతేకాదు కేసుల విచారణ జాబితాలోనూ అది లిస్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో కేవలం ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ అంశంపై నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. లేని పక్షంలో 17-ఎ కేసులో తీర్పు ఇచ్చే వరకూ విచారణను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News