పార్వేట మండపంపై దుష్ప్రచారం తగదు : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

తిరుమలలోని పార్వేట మండపం పునర్నిర్మాణంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదు అని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు.

Update: 2023-10-04 06:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమలలోని పార్వేట మండపం పునర్నిర్మాణంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదు అని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. అలిపిరి మెట్ల మార్గం మొదటి ప్రదేశంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని దాన్ని పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే 16వ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు నిర్మాణం చేసిన పార్వేట మండపం శిథిలావస్థకు చేరుకుందని దాన్ని కూడా కూల్చి పునర్నిర్మాణం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రూ.136 లక్షల రూపాలతో 20 పిల్లర్లతో యధావిధిగా పార్వేట మండపం పునర్ నిర్మాణం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు నడక దారిలో కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులనుంచి ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉందని ఈవో వెల్లడించారు. అంతేకాదు మధ్యాహ్నం 2 గంటలు తర్వాత చిన్నపిల్లలను అనుమతించాలనే ఆదేశాలు అటవీ శాఖ నుంచి అందలేదని చెప్పుకొచ్చారు. నడక మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News