Child marriage:బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని నాగటూరు గ్రామంలో 13 ఏళ్ల బాలికకు కుటుంబ సభ్యులు బాల్య వివాహం చేయడానికి సిద్ధమయ్యారు.

Update: 2024-08-31 14:35 GMT

దిశ,నందికొట్కూరు:నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని నాగటూరు గ్రామంలో 13 ఏళ్ల బాలికకు కుటుంబ సభ్యులు బాల్య వివాహం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం బాలికకు నిశ్చితార్ధం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలిక కొణిదెల జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఐసీడీఎస్ సూపర్వైజర్ అనురాధ, రెవెన్యూ అధికారులు వీఆర్వో రషీద్ , పోలీసులు గ్రామానికి చేరుకొని బాలిక తల్లిదండ్రులకు మైనర్ బాలికకు వివాహం చేయకూడదని, అలా చేయడం చట్ట రీత్యా నేరమన్నారు. 21 సంవత్సరాలు పూర్తయ్యాక వివాహం చేయాలని సూచించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.


Similar News