Tension erupts in Tadipatri : అనంతలో భగ్గుమన్న ఫ్యాక్షన్ గొడవలు

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా రాజకీయం మారిపోయింది.

Update: 2023-01-30 08:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా రాజకీయం మారిపోయింది. ఈ నియోజకవర్గంలో నిత్యం రాజకీయ రగడ చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాడిపత్రి పట్టణం మెయిన్ బజార్‌లో జేసీ వర్గీయులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు గండికోట కార్తీక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తలపై బలంగా కొట్టడంతో తల కాస్త పగిలింది. ఇకపోతే కార్తీక్ ఐటీడీపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వంపైనా.. నియోజకవర్గంలోని వైసీపీ విధానాలపై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. అందువల్లే కార్తీక్‌పై రాజకీయ ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. తాను వెళ్తున్నప్పుడు కావాలనే కాపు కాసి దాడికి పాల్పడ్డారని బాధితుడు కార్తీక్ ఆరోపించాడు. వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నాననే కక్షతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇకపోతే తాడిపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కార్తీక్‌ను అనంతపురం తరలించారు. తాడిపత్రిలో జేసీ వర్గీయుడిపై దాడికి పాల్పడటం ఒక్కసారిగా కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read more:

గ్రోత్ రేట్‌లో ఏపీ నంబర్ వన్ : CM YS Jagan Mohan రెడ్డి

రైతులంటే జగన్‌కు చిన్నచూపు.. పాదయాత్రలో నారా లోకేశ్ ఫైర్ 

Tags:    

Similar News