సీఎం జగన్పై దాడి.. స్పందించిన ప్రధాని మోడీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సిద్ధం సభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సిద్ధం సభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడితో జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయ్యింది. వెంటనే జగన్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం జగన్ పై జరిగిన దాడిపై ఏపీ కాంగ్రెస్ అధినేత వైఎస్ షర్మిల, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పలువురు ప్రముఖ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికన స్పందించి.. ముఖ్యమంత్రి జగన్ తొందరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చారు.