అనకాపల్లిలో హిజ్రా దారుణ హత్య.. వెలుగులోకి కొత్తకోణం

అనకాపల్లిలో దారుణం జరిగింది..

Update: 2025-03-20 12:36 GMT
అనకాపల్లిలో హిజ్రా దారుణ హత్య.. వెలుగులోకి కొత్తకోణం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి(Anakapalli)లో దారుణం జరిగింది. తణుకుకు చెందిన బన్నీ(Bunny).. హిజ్రా దీపు(Hizra Dipu)తో కలిసి కొన్నేళ్లుగా అనకాపల్లిలో సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య గొడవలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె దారుణ హత్యకు గురైంది. టవల్‌తో గొంతు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత శరీర భాగాలను ముక్కలు చేసి అనకాపల్లిలో అక్కడడక్కడా పడేశాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దొరికిన శరీర భాగాలు దీపువి కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. దీపు శరీర భాగాలను డీఎన్‌ఏ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

మరోవైపు అనకాపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీపు హత్యను నిరసిస్తూ హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్రం నలుమూల నుంచి భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ హాస్పిటల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. దీపును చంపిన బన్నీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News