ఆ నాలుగు పార్లమెంట్ స్థానాలపై జగన్ ఫోకస్.. ఇంచార్జులు వీరేనా..?
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ అధినేత దూకుడు పెంచారు....
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ అధినేత దూకుడు పెంచారు. వైసీపీ ఇంచార్జుల జాబితాపై పూర్తి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు ఎంపీ స్థానాలకు ఇప్పటికే ఇంచార్జులను నియమించారు. అయితే నాలుగు ఎంపీ స్థానాల ఇంచార్జుల నియమకంపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు. విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, నంద్యాలకు పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. విజయనగరం సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్‌నే కొనసాగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి అమర్‌నాథ్‌ను అనకాపల్లి ఎంపీ బరిలో ఉంచాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అటు అమలాపురం పార్లమెంట్ స్థానానికి చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాను పరిశీస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నంద్యాల ఎంపీ పరిశీలనలో ఇక్వాల్‌తో పాటు సినీ నటుడు అలీ ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది.